ప్రస్తుతం ప్రజలు ఎన్నికలను కోరుకోవడం లేదు : పృథ్వీరాజ్‌ చవాన్‌

ముంబయి: దేశంలో మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశమే లేదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్‌ చవాన్‌ బుధవారం స్పష్టం చేశారు. కేంద్రంలోని యూపీఏ సర్కారు తృణమూల్‌ కాంగ్రెస్‌ తన మద్దతును ఉపసంహరించుకున్నప్పటికీ సంస్కరణలను బలపరచే పార్టీల మద్దతు ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రజలు ప్రస్తుతం ఎన్నికలను కోరుకోవడం లేదనీ తమకు ప్రయోజనం చేకూర్చే విధాన నిర్ణయాల కోసం నిరీక్షిస్తున్నారనీ చవాన్‌ విలేకరులకు మాట్లాడారు. కేంద్రంలో రాజకీయ అస్థిరత అంటూ ఏదీ లేదన్నారు. ధరల పెరుగుదలను ప్రజలేవ్వరూ హర్షించరు అయితే, ప్రగతి సాధనకు ఆర్థిక సంస్కరణలు తప్పనిసరనే విషయాన్ని విస్మరించరాదని పేర్కొన్నారు.