ప్రాచీన కళలను ప్రోత్సాహించాలి హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్

 

వీణవంక మార్చి 11 (జనం సాక్షి) వీణవంక, మండలంలోని కనపర్తి గ్రామంలో ప్రాచీన కళలను ప్రతి ఒక్కరూ ప్రోచాహించాలని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. వీణవంక మండలం కనపర్తి గ్రామంలో గత మూడు రోజుల నుండి చిరుతల రామాయణం పట్టాభిషేకం మహోత్సవ కార్యక్రమం జరిగింది.శుక్రవారం రాత్రి ముగింపు కార్యక్రమాలకు హుజురాబాద్ స్థానిక ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హాజరై కళాకారులను ఉద్దేశించి . ఈ సందర్భంగా మాట్లాడుతూ కళలకు పుట్టిన ఇల్లు తెలంగాణ ప్రాంతం అన్నారు.తెలంగాణ లో ప్రాచీన కళలకు మంచి పట్టు ఉందన్నారు. తెలంగాణ రంగస్థల సాంస్కృతిక కళాకారుల అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు వంగ సుధాకర్ , జిల్లా ప్రధాన కార్యదర్శి అలివేలు సమ్మిరెడ్డి ,జిల్లా కోశాధికారి బోళ్ల కొమురయ్య, నల్లగొనీరమేష్ అధ్యక్షులు వీణవంక , వీరెల్లి రామచంద్ర రెడ్డి, జిల్లా సహాయ కార్యదర్శి మాడరాజు రెడ్డి ,దొంగల రాజయ్య, జిల్లా డైరెక్టర్లు పడాల సత్యనారాయణ , శంకరపట్నం అధ్యక్షులు , శంకరపట్నం మండలం పిట్టల సంపత్ అధ్యక్షులు మానకొండూరు , తిరుపతి, ఇల్లంతకుంట మండల నల్లగొనీ తిరుపతి గౌడ్, వివిధ గ్రామాల కళాకారులు , స్థానిక సర్పంచ్ పర్లపెల్లి రమేష్ , మోరే స్వామి ఎంపీటీసీ తదితరులు పాల్గొన్నారు. కళాకారులందరికీ జిల్లా కమిటీ పక్షాన ప్రశంస పాత్రలు అందించి అభినందించారు.