ప్రాథమిక విద్యకు రాజీవ్‌ విద్యా మిషన్‌తో కలిపి 25వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం:శైలజనాద్‌

పశ్చిమగోదావరి: ప్రాథమిక విద్యకు రాజీవ్‌ విద్యామిషన్‌ నిధులతో కలిపి రూ.25 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని ప్రాథమిక విద్యాశాఖ మంత్రి శైలజనాద్‌ అన్నారు. తణుకులో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. విద్యా ప్రమానాల పరంగా ప్రాథమిక, సెకండరీకి మధ్య అంతరాలు లేవని అన్నారు. సౌలభ్యం కొరకే విభజించామని తెలిపారు. పాఠ్యపుస్తకాలన్నీ ముద్రణ అయి ఉన్నాయని, రవాణ ఇతర కారాణాలవల్ల విద్యార్థులకు సరఫరా కాకపోతే వెంటనే చర్యలు తీసుకుంటామని అన్నారు.