ప్రారంభమైన ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌

హైదరాబాద్:ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది పార్లమెంట్‌ హౌస్‌లో పోలింగ్‌ కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. తొలి ఓటును మన రాష్ట్రానికి చెందిన నరసాపురం ఎంపీ, తితిదే ఛైర్మన్‌ కనుమూరి బాపిరాజు వేశారు. రాష్ట్రపతి ఎన్నికల  పోలీంగ్‌లో కూడా తొలి ఓటు వేసే అవకాశం బాపిరాజుకే దక్కడం విశేషం. ఓటు హక్కు వినియోగించుకోవడానికి లోక్‌సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు పార్లమెంట్‌కు చేరుకుంటున్నారు.