ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులను ఏర్పాటు చేయాలి : సుప్రీంలో విశ్రాంత ఐఏఎస్‌ అధికారిణి పిటిషన్‌

హైదరాబాద్‌: దేశంలో మహిళలపై జరుగుతున్న దాడుల విచారణకు ఫాస్ట్‌ట్రాక్‌  కోర్టులను ఏర్పాటు చేయాలని కోరుతూ విశ్రాంత ఐఏఎస్‌ అధికారిణి ప్రమీల శంకర్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ అంశంలో ప్రధాన న్యాయమూర్తి జోక్యం చేసుకోవాలని ఆమె కోరారు. ప్రభుత్వం నివేదికల పేరుతో కాలయాపన చేస్తోందని కొత్త కమిటీల ద్వారా న్యాయం జరగదని వెంటనే ఫాస్ట్‌ట్రాక్‌ కోర్పులను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆమె తన పిటిషన్‌లో అభ్యర్థించారు.