ఫిల్మ్‌ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఆధ్వర్యంలో తెలంగాణ నేతల సమావేశం

హైదరాబాద్‌: తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఆధ్వర్యంలో తెలంగాణ నేతలు భేటీ అయ్యారు. తెలంగాణ మాలమహానాడు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ రౌండ్‌ సమావేశానికి తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం, ప్రముఖ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ, ఎస్‌,శంకర్‌, శ్రీనివాస్‌ గౌడ్‌, రసమయి బాలకృష్ణ తదితరులు హాజరయ్యారు. ఈ సమావేశంలో తెలుగు సినీ పరిశ్రమకు ప్రభుత్వం కేటాయించిన భూముల పరిరక్షణపై చర్చిస్తున్నట్టు సమాచారం.