ఫీజు చెల్లింపుపై నేడు ప్రభుత్వ ప్రకటన

హైదరాబాద్‌: ఇంజినీరింగ్‌ కోర్సుల్లో కొత్తగా ప్రవేశం పొందుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ, వికలలాంగ విద్యార్థులకు భోధన రుసుం పథకం కింద ఎంతమొత్తం చెల్లించాలనే విషయంపై రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు సృష్టమైన నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. నిన్న సచివాలయంలో మంత్రులు బొత్స సత్యనారాయణ. పితాని సత్యనారాయణ, బస్వరాజు సారయ్య ముఖ్యమంత్రిని కలిసి ఇంజినీరింగ్‌ బోథన రుసుముల చెల్లింపుపై చర్చించారు. ఈ రోజు మరోసారి సమావేశమైన తర్వాత తుది నిర్ణయం ప్రకటించనున్నట్లు మంత్రి పితాని సత్యనారాయణ తెలియజేశారు.