ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వ తీరు బాధకరం:దేవేందర్‌గౌడ్‌

హైదరాబాద్‌: రాష్ట్రంలో రోజుకు రూ.17 ఆదాయంతో ఇప్పటికీ లక్షలాది కుటుంబాలు బతుకుతున్నాయని తెలుగుదేశం పార్టీ సీనియర్‌నేత దేవేందర్‌గౌడ్‌ వ్యాఖ్యనించారు. ఈ విషయంపై మంత్రుల కమిటీ నివేదిక బాధకరమని, విద్యార్థులను చదువుకు దూరం చేయాలనే ఆలోచన ప్రభుత్వానికుందని. ఈ విషయంపై మంత్రుల నిర్ణయాలు వెనక్కి తీసుకొవాలని అన్నారు. విద్యార్థులందరికి ఫీజు రీయింబర్‌మెంట్స్‌ కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. తాగునీటి పథకాలకు ఖర్చుపెట్టిన డబ్బుతో ఒక్క ప్రాజెక్ట్‌ కూడా పూర్తి కాలేదని ఆయన విమర్శించారు.