ఫేస్‌బుక్‌ ఫ్రెండ్‌ దుర్మార్గం

ఫేస్‌బుక్‌లో పరిచయమైన మహిళను.. పెండ్లి చేసుకుంటాన ని నమ్మించి ఓ వ్యక్తి లైంగికదాడికి పాల్పడ్డాడు. జైపూర్‌కు చెందిన విడాకులు తీసుకున్న ఓ మహిళ (28)కు జార్ఖండ్‌కు చెందిన రంజన్‌పాండే ఫేస్‌బుక్‌లో పరిచయమయ్యాడు. పెండ్లి చేసుకుంటానని సహజీవనం చేసి ముఖం చాటేశాడు. దీంతో సదరు మహిళ శ్యామ్‌నగర్ కోర్టులో ఫిర్యాదు చేసింది. దీని ఆధారంగా పోలీసులు రంజన్ ఆచూకీ గురించి ఆరా తీస్తున్నారు.