ఫోన్ ట్యాపింగ్ పై సమగ్ర విచారణ జరపాలి:వీహెచ్
హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ నుంచి రెండు బెటాలియన్ల పోలీసులను ఎందుకు తీసుకువచ్చారు?…ఇక్కడ యుద్ధం చేస్తారా అని కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు ప్రశ్నించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్ జరగలేదు… స్టీఫెన్‌సనే ఫోన్ రికార్డు చేశారని తెలిపారు. మిత్రపక్షమన్న సాకుతో చంద్రబాబును వదిలిపెట్టవద్దని ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరపాలని వీహెచ్ డిమాండ్ చేశారు.