ఫ్యాక్టరీలో వ్యక్తి మృతదేహం లభ్యం.

 

 

 

 

 

 

 

 

బై0సా. రూరల్ మార్చ్ 08 జనం సాక్షి

నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని నాందేడ్ రహదారి లో గల పడిగెల ఫ్యాక్టరీలో ఓ వ్యక్తి మృతదేహం లభ్యం అయింది.స్థానికుల ప్రజలు తెలిపిన వివరాల ప్రకారం… సిరాల గ్రామానికి చెందిన శేక్ హైమద్ మియా(60) స్థానిక తను పనిచేస్తున్నటువంటి పడిగెల ఫ్యాక్టరీలో బుధువారం విగతజీవిగా పడి వున్నాడు.ఒంటి పై గాయాలు వుండడం పై హత్య అన్నట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పలు కోణాల్లో ఆరా తీస్తున్నారు.ఇదే ఫ్యాక్టరీలో పని చేస్తున్నటువంటి పలువురు బీహార్ వ్యక్తులు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు గుర్తించారు. షేక్ హైమద్ మియా హత్యకి బీహార్ వాళ్ళకి సంబంధం ఏదైనా వుందా అనేకోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. పరారీలో ఉన్నటువంటి బీహార్ గ్యాంగ్ సమాచారం కొరకు ఇప్పటికే ఓ పోలీసు ప్రత్యేక బృందం నిఘా ఉంచింది. మృతుడిని పోస్టుమార్టం నిమిత్తం ప్రాంతీయ ఆసుపత్రికి చేర్చిన తర్వాత హాత్య లేక ఆత్మహత్య అనే విషయం వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.