బంగారు తెలంగాణను నిర్మిస్తాం : కవిత
నిజామాబాద్ : ఐదేండ్లలో బంగారు తెలంగాణను నిర్మిస్తామని టీఆర్‌ఎస్ ఎంపీ కవిత పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తూ.చ. తప్పకుండా అమలు చేస్తున్న పార్టీ టీఆర్‌ఎస్ మాత్రమేనని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల కోసం ప్రాణమిచ్చే కుటుంబంలో నుంచి వచ్చిన తమపై ఎవరెన్ని ఆరోపణలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని తెలిపారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం పని చేస్తుందన్నారు.