బంగ్లాదేశ్‌లో భారీ అగ్ని ప్రమాదం .. 121 మంది మృతి

ఢాకా : బంగ్లాదేశ్‌లోని దుస్తుల ఫ్యాక్టరీలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 121కి చేరింది, సహాయక సిబ్బంది ఆదివారం ఉదయం 112 మృతదేహాలను వెలికితీశారు. ఉత్తర ఢాకాకు 30 కిలో మీటర్ల దూరంలో ఉన్న బహుళ అంతస్తుల దుస్తుల ఫ్యాక్టరీలో శనివారం సాయంత్రం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మంటలు భారీగా ఎగిసిపడి భవనంలోని పలు అంతస్తులకు వ్యాపించాయి. మంటల నుంచి తప్పించుకునేందుకు పలువురు పై నుంచి దూకారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన అనంతరం స్థానిక పోలీసు అధికారి మాట్లాడుతూ ప్రమాదంలో 9 మంది కార్మికులు మృతి చెందారని వంద మందికిపైగా గాయపడ్డారని తెలియజేశారు. అయితే ఈ ఉదయం భారీ సంఖ్యలో మృతదేహాలను సహాయక సిబ్బంది వెలికి తీశారు.షార్ట్‌సర్క్యూట్‌ కారణంగానే ప్రమాదం సంభంవించిదని అనుమానిస్తున్నారు.

తాజావార్తలు