బంద్‌లు వద్దంటూ విద్యార్థుల ర్యాలీ

హైదరాబాద్‌:బంద్‌ల నుంచి విద్యాసంస్థలను మినహాయించాలని కోరుతూ హైదరాబాద్‌లో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు.బంద్‌లు వద్దని నినాదాలు చేస్తూ బాగలింగంపలిల్లలోని సుదరయ్య విజ్ఞానకేంద్రం నుంచి ఇందిరాపార్క్‌ వరకు ర్యాలీ నిర్వహించారు.విద్యాసంస్ధలను ఎస్మా పరిధిలోకి తేవాలని వారు కోరారు.బంద్‌లు వద్దని గతంలో మానవహక్కుల సంఘాన్ని,హైకోర్టును అశ్రయించినా ప్రయోజనం కలగలేదని ఆవేదన వ్యక్తం చేశారు.