బట్రాజుల సంఘం ఎన్నికబట్రాజుల సంఘం ఎన్నిక
రామకృష్ణా పూర్, (జనంసాక్షి) :క్యాతన్ పల్లి మున్సిపాలిటీలోని గద్దె రాగడిలో మంచిర్యాల జిల్లా బట్రాజుల సంఘం ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల అధికారిగా చిన్న మాధవుని శ్రీరామరాజు, ఎన్నికల పరిశీలకుడిగా నన్నపు రాజు లక్ష్మణ రాజు, సహాయ పరిశీలకుడిగా బట్టు ఆనందరాజు, దేవరాజు, లింగరాజు నిర్మల్ వాస్తవ్యులు వారి ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా ఎన్నికలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు వారు ప్రకటించారు.గౌరవ అధ్యక్షులుగా తుమికి శంకర్ రాజు , బొల్లపల్లి భాస్కర్ రాజు, ముఖ్య సలహాదారులుగా ఈలపంటి మహేందర్ రాజు, దేవరాజు ధర్మపురి రాజు, గొల్లపల్లి దామోదర్ రాజు, ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి కేసి పెద్ది రామరాజు ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు.మంచిర్యాల జిల్లా అధ్యక్షులుగా చక్రధరి సురేందర్ రాజు, ఉపాధ్యక్షులుగా చెన్నమాధవుని శ్రీధర్ రాజు, విలాస కవి వెంకట్రాజు, ప్రధాన కార్యదర్శిగా అరవరాజు శ్రీనివాసరాజు, కార్యదర్శులుగా కూరపాటి చంద్రశేఖర్ రాజు, దేవరాజు ఆదర్శ వర్ధన్ రాజు, కోశాధికారిగా చెన్న మాధవుని విజయేందర్ రాజు, కార్య నిర్వాహక కార్యదర్శిగా బిరుదు రాజు శ్రీధర్ రాజు, సాంస్కృతిక, ప్రచార కార్యదర్శిగా వ్యాసభట్టు రాధా కిషన్ రాజు, క్రీడా వ్యవహార కార్యదర్శిగా దేవరాజు సంతోష్ రాజు, కార్యవర్గ సభ్యులుగా బొల్లెపల్లి వెంకట్ రాజు, తంగిళ్ళ పురుషోత్తమ రాజు, చెన్న మాధవుని సురేందర్ రాజు ,విలాసకవి సత్యం రాజు, కాసు శ్రీనివాసరాజులను ఎన్నుకున్నారు.రాష్ట్ర సంఘంలో మంచిర్యాల జిల్లా నుండి కార్యదర్శిగా మంచిర్యాల జిల్లా వాస్తవ్యులు కేశి పెద్ది రామరాజుని ఎన్నుకున్నట్లు ప్రకటించారు. ఈ ఎన్నికలు సజావుగా జరిగినట్లు, అదేవిధంగా నూతన కార్యవర్గాన్ని రాష్ట్ర సంఘానికి పంపినట్లు పేర్కొన్నారు.