బడ్జెట్‌ రూపకల్పనపై మంత్రి ఈటెల సమావేశం

హైదరాబాద్‌: తెలంగాణ సంవత్సరానికి సంబంధించి 2015-16 సంవత్సరానికిగాను బడ్జెట్‌ను రూపొందించడానికి ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌ వివిధ శాఖల అధికారులతో సమావేశమాయ్యరు. తెలంగాణలో అమలులో ఉన్న సంక్షేమ పథకాల నిర్వహణ వ్యయం, అలాగే వివిధ శాఖలు చేపట్టిన పనులకు కావాల్సిన నిధులు, అలాగే వివిధ శాఖల నుంచి వస్తున్న ఆదాయం తదితర అంశాలపై మంత్రి ఈటెల అధికారులను వివరణ కోరినట్లు తెలిసింది.