బడ్జెట్ లో పోతారం లిఫ్ట్ ఇరిగేషన్ కు నిధులు కేటాయించాలి – మంథని మాజీ జడ్పీటీసీ మూల సరోజన

 జనం సాక్షి , మంథని : ఈ నెల 6 వ తేదీ న అసెంబ్లీలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్ లో మంథని మండలం లోని పోతారం లిఫ్ట్ ఇరిగేషన్ కు నిధులు కేటాయించాలని ఈ ప్రాంత రైతాంగం తరపున కోరుతున్నట్లు మంథని మాజీ జెడ్పిటిసి మూల సరోజన తెలిపారు. గతంలో 320 కోట్లరూపాయలతో ఎస్టిమేషన్లు వేసిన కూడా దీని కంటే తర్వాత వేసిన చెన్నూర్ కు నిధులు కేటాయించారని అన్నారు. మంథని టేలండ్ ప్రాంతం కాబట్టి దాదాపు 30,000 వేల ఎకరాల భూమి నీళ్లు లేక బీడు గా మారిందని , ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ బడ్జెట్ లో పోతారం లిఫ్టు కు నిధులు కేటాయించాలని ఈ ప్రాంత రైతు బిడ్డగా ప్రభుత్వం ను కోరుతున్నానని పేర్కొన్నారు.