-->

బతుకమ్మ చీరల పంపిణీ

జనం సాక్షి,వంగూర్
మండల పరిధిలోని ఉప్పలపహాడ్ గ్రామానికి చెందిన లబ్ధిదారులకు దసరా పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు కలిగిన మహిళలకు అందిస్తున్న బతుకమ్మ చీరలను గ్రామ సర్పంచ్ చిమ్ముల పద్మమ్మ చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బతుకమ్మ చీరల ఆడపడుచులకు పుట్టింటి కెళ్ళి వచ్చే సారే అని సీఎం కేసీఆర్ కు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రామస్వామి, గ్రామ పంచాయతీ సెక్రెటరీ సుధా, టిఆర్ఎస్ గ్రామ ప్రెసిడెంట్ గణేష్ యాదవ్, టిఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, నర్సిరెడ్డి, ఖలీల్, జంగారెడ్డి, సైదులు వార్డ్ మెంబర్స్ గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.