బలమైన పంచ్‌ల వల్లే నబీల్‌ మృతి

హైదరాబాద్‌, మే 12: మెడ, గుండెపై బలమైన పంచ్‌ల వల్లే స్ర్టీట్‌ఫైట్‌లో నబీల్‌ మృతి చెందినట్టు పోస్టుమార్టం నివేదిక వెల్లడించింది. నబీల్‌ పోస్టుమార్టం నివేదికను ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు పోలీసులకు అందజేశారు. నబీల్‌ శరీరంపై తొమ్మిది చోట్ల బలమైన పంచ్‌లు తగిలినట్టు వైద్యులు అందులో పేర్కొన్నారు. ఈ కారణంగానే ఆయన మృతి చెందినట్టు స్పష్టం చేశారు.