బలహీనంగా మారిన అల్పపీడన ద్రోణి

విశాఖపట్నం: ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి మరింత బలహీనంగా మారినట్లు విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. నైరుతి రుతుపవనాలు సైతం మందగించాయని. దీని వల్ల రాష్ట్రంలో అక్కడక్కడ మాత్రమే తేలికపాటి జల్లులుకురిసే అవకాశం ఉన్నట్లు తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలియజేశారు.వర్షాలు తగ్గముఖం పట్టడంతో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయన్నారు. ఇదే పరిస్థితి మరో రెండ్రోజులు కొనసాగుతుందని అధికారులు వివరించారు.