బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య 30

హైదరాబాద్‌: హైదరాబాదు నుంచి షిర్డీ వెళ్తూ మహారాష్ట్ర సరిహద్దులో లోయలో పడిన బస్సు ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 30గా తేలింది. మరో 20 మంది తీవ్రంగా గాయపడగా వారిలో 8 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు  తాజా సమాచారం.ఈ ప్రమాదంలో 34 మంది దాకా మరణించివుంటారని తొలుత భావించారు. మృతులు, క్షతగాత్రుల బంధువుల కోసం ప్రభుత్వం షోలాపూర్‌కు  ప్రత్యేక బస్సును ఏర్పాటుచేసింది.గాయపడినవారికి మెరుగైన చికిత్స అందించే  ఏర్పాటు చేయాల్సిందిగా ఆయనను కోరారు. పోస్టు మార్టం అనంతరం మృతిదేహాలను హైదరాబాద్‌ ఉస్మానియాకు తరలించేలా చర్యలు తీసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి అధికారులను  ఆదేశించారు.ఈ విషయమై రవాణా,వైద్య, రెవెన్యూ శాఖలతో ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమీక్ష జరిపారు.