బస్సు ప్రమాద మృతుల వివరాలు …

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ నుంచి షిర్డీ వెళ్లిన బస్సు షోలాపూర్‌ సమీపంలో ప్రమాదానికి గురై 30 మంది మృతి చెందినట్లు 15 మంది గాయపడినట్లు ఉస్మానాబాద్‌ కలెక్టర్‌ ప్రవీణ్‌ తెలిపారు. మృత దేహాలకు 17 మంది డాక్టర్లు పోస్ట్‌మార్టం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహలను హైదరాబాద్‌ ఉస్మానియా ఆసుపత్రికి తరలించనున్నట్లు కలెక్టర్‌ ప్రకటించారు. వెల్ధూర్థి మండలం ఓదెల వాసులు ఒకే కుటుంబానికి చెందని ఎనిమిది మంది ఈ ప్రమాదంలో మృతి చెందారు. ఈ ప్రమాదంలో మృతులు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కృష్ణ సాహిత్య, వాణి మానస, ఉమ, శేఖర్‌, నరేష్‌, సావర్ణిక, సుజిత, దివ్య, దీప్తి, ప్రవీణ్‌, పూజిత, కీర్తి, కిరణ్‌, మోహన్‌రావు, దీపిక, జయవర్ధన్‌, సాయి ప్రణిత, రామారావు, సునిల్‌, సంతోష్‌గుప్త, చెన్నకేశవరెడ్డి, సుష్మా, తేజోపతి, ఆసమ్మ, గౌతమ్‌, రజిత, ప్రపుల్‌లు ఉన్నారు. ఇంకా మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.