-->

బాదుడే బాదుడు.. పెట్రోల్‌పై 37, డీజిల్‌పై 38 పైసలు వడ్డింపు

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మరోసారి పెరిగాయి. చమురు మార్కెటింగ్‌ కంపెనీలు వరుసగా నాలుగో రోజూ లీటరు పెట్రోల్‌, డిజిల్‌పై 35 పైసల చొప్పున వడ్డించాయి.
దీంతో ఢిల్లీలో పెట్రోల్‌ ధర రూ.107.24కి చేరగా, డీజిల్‌ ధర రూ.95.97కు పెరిగింది. ఇక ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్‌ రూ.113.12, డీజిల్‌ రూ.104కు పెరిగింది. కోల్‌కతాలో పెట్రోల్‌ రూ.107.78, డీజిల్‌ రూ.99.08, చెన్నైలో పెట్రోల్‌ రూ.104.22, డీజిల్‌ రూ.100.25కి చేరాయి.
తాజా పెంపుతో హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు 37 పైసలు అధికమై రూ.111.55కి చేరగా, డీజిల్‌పై 38 పైసలు అధికమై రూ.104.70కు పెరిగింది. కాగా, వరుసగా నాలుగు రోజులుగా పెట్రో ధరలు పెరుగుతూ వస్తున్నాయి. దీంతో నాలుగు రోజుల వ్యవధిలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రూ.1కిపైగా పెరిగాయి.