బాపూజీ అంతిమ యాత్ర ప్రారంభం

హైదరాబాద్‌: ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు కొండా లక్ష్మీణ్‌ బాపూజీ అంతిమ యాత్ర కాచీగూడలోని పద్మశాలి భవన్‌ నుంచి ప్రారంభమైంది. గాంధీభవన్‌కు ఈ యాత్ర సాగనుంది. అక్కడి నుంచి గన్‌పార్క్‌ మీదుగా హుస్సేన్‌సాగర్‌ పక్కన ఉన్న జలదృశ్యం వద్దకు యాత్ర చేరుకోనుంది. అక్కడ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ అంతిమ యాత్రకు పెద్దసంఖ్యలో అభిమానులు పలు పార్టీల నేతలు తరలివచ్చారు.