బాబు హామీలివ్వడమే తప్ప ఏమీ చేయలేదు: పొంగులేటి

హైదరాబాద్‌: అభివృద్దంతా తనతోనే జరిగిందంటోన్న చంద్రబాబు దత్తత తీసుకున్న పాలమూరు జిల్లాకు ఏం చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని ఏఐసీసీ కార్యదర్శి పొంగులేటి సుధాకర్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. హామీలు తప్ప బాబు జిల్లాకు ఏమీ చేయలేదన్న ఆయన, తెలంగాణ విషయమై స్పష్టత ఇవ్వాలి తప్ప అఖిలపక్షం అంటూ ప్రజల చెవుల్లో పూలు పెట్టవద్దని సూచించారు. కాంగ్రెస్‌ పార్టీకి ఎవరితోనూ కుమ్మక్కు కావాల్సిన అవసరం లేదని, తెదేపా, వైకాపా అధికారం కోసం పోటీ పాదయాత్రలు చేస్తున్నాయని పొంగులేటి మండిపడ్డారు.