బాబ్లీ కేసులో 16కు వాయిదావేసిన సుప్రీం కుర్టు

ఢిల్లీ: బాబ్లీ కుసులో తుది వాదనలను సుప్రీంకోర్టు ఈ నెల 16కు వాయిదా వేసింది. బాబ్లీ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ చేస్తున్న వాదనలో అర్థంలేదని సుప్రీంకోర్టులో మహారాష్ట్ర ప్రభుత్వం తన వాదన వినిపించింది. కేవలం తాగునీటీ కోసమే బాబ్లీ నిర్మాణం చేశామని, ఆంధ్రప్రదేశ్‌ లేని వివాదాన్ని పెద్దగా చూపుతోందని వివరించింది. ఈ వాదనలు విన్న మీదట సుప్రీంకోర్టు కుసును ఈ నెల 16కు వాయిదా వేసింది.