బాలల ఎదుగుదల ప్రభుత్వ లక్ష్యం.

..

 

 

 

 

అంగన్వాడీల ద్వారా పౌష్టిక ఆహారం పంపిణీ..
తెలంగాణ బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు శోభారాణి…
శంకరపట్నం: జనం సాక్షి’ మార్చి 10
బాలల ఎదుగుదల ప్రభుత్వ లక్ష్యమని అంగన్వాడీల ద్వారా పౌష్టిక ఆహారాన్ని అదించి బాలల ఎదుగుదల కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలంగాణ బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు హనుమండ్ల శోభారాణి అన్నారు. శుక్రవారం శంకరపట్నం మండలం కేశవపట్నం అంగన్వాడి కేంద్రంలో ఐసిడిఎస్ కరీంనగర్ రూరల్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో, చిన్నారులకు స్పందన సేవా సొసైటీ ఆధ్వర్యంలో మహిళలు కుట్టిన దుస్తులను, కిడ్స్ మేళా నిర్వహించి, శోభారాణి ముఖ్య అతిథిగా అందజేశారు. ఈ సందర్భంగా శోభారాణి మాట్లాడారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో, అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వము బాలలకు మహిళలకు పౌష్టికఆహార అందిస్తుందని, చంటి పిల్లల తల్లులు, గర్భిణీ స్త్రీలు, చిన్నారులు, మహిళలు అంగన్వాడి సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బండారి స్వప్న తిరుపతి, ఎంపీటీసీ బొజ్జ కవిత కోటిలింగం, డి డబ్ల్యు ఓ సబిత, ఏసీడిపిఓ అరవింద, అంగన్వాడి సూపర్వైజర్ స్రవంతి, అంగన్వాడీ టీచర్లు కాంత, రాజమణి ,సోని, సుమలత, కమలాబాయి, పద్మావతి, భాగ్యలక్ష్మి, యశోద, కవిత, రాణి, స్వరూప, శిరీష, పుణ్యవతి, యశోద, భద్ర, సుభద్ర, ఆయాలు, గర్భిణీ స్త్రీలు, చంటి పిల్లల తల్లులు, చిన్నారులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు