బాలినేని, కొండా సురేఖల సభకు భారీగా ఏర్పాట్లు

దొనకొండ , జూలై 28 : మండలంలోని గంగదేవిపల్లి గ్రామంలో మండల కేంద్రమైన దొనకొండలోని బస్టాండ్‌ సెంటర్‌లో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించే బాలినేని శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖల బహిరంగ సభ విజయవంతంకు మండల పార్టీ కన్వీనర్‌ కందుల నారపురెడ్డి భారీగా ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు. గంగదేవిపల్లి గ్రామంలో వైయస్‌ఆర్‌ సిపి అధికార ప్రతినిథి నందిరెడ్డి కోటిరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైయస్‌ఆర్‌ విగ్రహంను ప్రారంభించి గంగదేవిపల్లి నుంచి దొనకొండలోని అంబేద్కర్‌ విగ్రహం వరకు ద్విచక్ర వాహనాలతో భారీగా ర్యాలీ నిర్వహించి అక్కడ నుంచి బహిరంగసభ ప్రదేశానికి బాణాసంచాలు కాలుస్తూ మేళతాళాలతో భారీగా ఊరేగింపు నిర్వహించడం జరుగుతుందని కన్వీనర్‌ తెలిపారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధి నాయకులు మండలానికి విచ్చేయుచున్న సందర్బంగా వారికి స్వాగతం పలికేందుకు మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన వైయస్‌ఆర్‌ సిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు జగన్‌యువసేన సభ్యులు అధిక సంక్యలో పాల్గొని విజయవంతం చేయాలని కందుల నారపురెడ్డి పిలుపునిచ్చారు.