బాలీవుడ్‌ నటుడు మిథిలేష్‌ చతుర్వేది కన్నుమూత

share on facebook

సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సీనియర్‌ బాలీవుడ్‌ నటుడు మిథిలేష్‌ చతుర్వేది(68) కన్నుమూశాడు. గత సాయంత్రం గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ లక్నోలో తుది శ్వాస విడిచాడు. మిథిలేష్‌ అల్లుడు ఆశిష్‌ చతుర్వేది సోషల్‌ విూడియా వేదికగా మిథిలేష్‌ మరణ వార్తను వెల్లడిరచాడు. ఆయన మరణం పట్ల పలువురు బాలీవుడ్‌ సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.
మిథిలేష్‌ చతుర్వేది రెండు దశాబ్దాలకు పైగా సినీ పరిశ్రమలో కొనసాగుతున్నాడు. 1997లో వచ్చిన ’భాయ్‌ భాయ్‌’ సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన మిథిలేష్‌.. అనతి కాలంలోనే అగ్ర కథానాయకుల సినిమాల్లో నటించి ఇండస్ట్రీలో గొప్ప నటుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ’కోయి మిల్‌ గయా’, ’ఏక్‌ ప్రేమ్‌ కథ’, ’సత్య’, ’బంటీ ఔర్‌ బబ్లీ’, ’క్రిష్‌’, ’తాల్‌’, ’రెడీ’ వంటి సినిమాలు ఈయనకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఈయన పలు టీవీ సిరీస్‌లలోనూ నటించాడు. కయామత్‌, సింధూర్‌ తేరే నామ్‌ కా, నీలి ఛత్రి వాలే వంటి సిరీస్‌లతో బుల్లతెర ప్రేక్షకులను ఎంట్టంల్గªన్‌ చేశాడు. ఈయన చివరగా అమితాబ్‌ బచ్చన్‌`ఆయుష్మాన్‌ ఖురానా నటించిన ’గులాబో సితాబో’ సినిమాలో నటించాడు

Other News

Comments are closed.