బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం విజయవంతం. చల్ల శ్రీలత రెడ్డి

నేరేడుచర్ల (జనంసాక్షి)న్యూస్ :ఈనెల  31న జరగనున్న నేరేడుచర్ల  వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన కార్యవర్గ  ప్రమాణ స్వీకారానికి,బి ఆర్ ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనానికి  తెలంగాణ రాష్ట్రం మంత్రులు  వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు  బడుగుల లింగ యాదవ్ స్థానిక శాసనసభ సభ్యులు శానంపూడి సైదిరెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని  బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షురాలు, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ చల్ల శ్రీలత రెడ్డి  శుక్రవారం నేరేడుచర్ల పట్టణ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన  సమీక్ష సమావేశంలో కార్యకర్తలకు  సూచనలు చేసి , కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని  ఆమె కోరారు. కార్యక్రమంలో నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్ చందమల్ల జయబాబు.బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి చిత్తలూరి  సైదులు, మార్కెట్ కమిటీ చైర్మన్ నాగండ్ల  శ్రీధర్,మత్స్య శాఖ చైర్మన్ యామిని వీరయ్య,మాజీ సర్పంచ్ కొణతం సత్యనారాయణరెడ్డి,అధికార ప్రతినిధి ఇంజమూరి మల్లయ్య,పార్టీ సీనియర్ నాయకులు రమేష్ బాబు, ఇంజమూరి రాములు,బొడ్డుపల్లి సుందరయ్య,కట్టా వెంకటరెడ్డి, మహిళా సంఘం కట్టా కళావతి,కార్యదర్శి కైరుంబి, నక్క రమాదేవి,యూత్ అధ్యక్షులు పోకబత్తిని రాజేష్, కార్యదర్శి షేక్ ఇష్థియాక్,వార్డు అధ్యక్షులు, కార్యదర్శులు,నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.