బిఎస్‌ఎన్‌ఎల్‌లో రోమింగ్‌ ఉచితం

శ్రీకాకుళం, జూలై 10 : బిఎస్‌ఎన్‌ఎల్‌ తమ వినియోగదారులకు మరో ఆకర్షనీయమైన పథకాన్ని ప్రారంభించింది. ఇప్పటివరకు అమలులో ఉన్న రోమింగ్‌ను ఎత్తివేసింది. శ్రీకాకుళం జిల్లాకు పొరుగునే ఒడిషా ఉండడంతో ఇక్కడి ప్రజలు, వ్యాపారస్తులు అక్కడికి వెళ్తుంటారు. అటువంటివారికి ఊరట కలిగించేందుకు బిఎస్‌ఎన్‌ఎల్‌ రోమింగ్‌ చార్జీలను ఎత్తివేసింది.