బిజెపిలో పేరాల అసంతృప్తి స్వరాలు
పార్టీ నేతలకు లేఖలో ఆవేదన
హైదరాబాద్,అక్టోబర్8(జనంసాక్షి) : బీజేపీలో మరోసారి ప్రగతి భవన్ ప్రకంపనలు చెలరేగాయి. కమలనాథులు మధ్య అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. తనను బలిపశువును చేశారంటూ బండి సంజయ్, కిషన్ రెడ్డి, సంఫ్‌ుపరివార్‌కు బీజేపీ జాతీయ మాజీ కార్యదర్శి పేరాల శేఖర్ రావు బహిరంగ లేఖ రాశారు. లింగోజిగూడ డిమిజన్ ఏకగ్రీవం కోసం ప్రగతి భవన్ వెళ్లిన సందర్భంగా ఏం జరిగిందో వివరిస్తూ పేరాల శేఖర్ లేఖ రాశారు. పార్టీ ప్రతిష్టను పణంగా పెట్టి వ్యక్తిగత, ఆర్థిక, రాజకీయ స్వార్థ వ్యవహారాలు అంతర్గత అవినీతిపై లేఖ రాశారు. పార్టీలో టీం స్పిరిట్ కొరవడిరదని.. వ్యక్తిగతంగా కానీ .. సమావేశాల్లో కానీ స్వేచ్ఛగా మాట్లాడలేకపోతున్నామని తెలిపారు. సంఫ్‌ు పెద్దలు, మంత్రి శ్రీనివాసులు ప్రోద్బలంతో కిషన్ రెడ్డికి బండి సంజయ్ క్లీన్ చిట్ ఇచ్చారన్నారు. కిషన్ రెడ్డిని కాపాడుకున్న సంఫ్‌ు పెద్దలకు, మంత్రి శ్రీనివాసులుకు, బండి సంజయ్‌కి తాను ఎందుకు గుర్తురాలేదని ప్రశ్నించారు. కనీసం తనతో ఫోన్లో గాని వ్యక్తిగతంగా కాని ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. పార్టీలో కొంతమంది చేస్తోన్న దందాలు.. లోపాయికారీ వ్యహారాలు తాను చేయలేదని పేరాల శేఖర్ రావు లేఖలో పేర్కొన్నారు.