బిజెపి వెబ్‌సైట్‌ హ్యాక్‌

న్యూఢిల్లీ,మార్చి5(జ‌నంసాక్షి):  బిజెపికి  చెందిన వెబ్‌సైట్‌ హ్యాక్‌ అయింది. ఈ విషయంపై కొందరు సోషల్‌
విూడియా యూజర్లు రిపోర్ట్‌ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీకు చెందిన మేమ్స్‌ను పోస్ట్‌ చేశారని సదరు యూజర్లు వాటి స్క్రీన్‌షాట్లను బయటపెట్టారు. సోదరులారా? నేను మిమ్మల్ని ఫూల్‌ను చేశాను?. ఇంకా ఇలాంటివి చాలా రానున్నాయి ? అని మోడీ అన్నట్లుగా ఈ మేమ్స్‌ పోస్ట్‌ చేశారు. దీనిపై తక్షణమే  స్పందించిన బిజెపి తమ వెబ్‌సైట్‌ను నిలిపేసింది. ప్రస్తుతం ఆ సైట్‌ను తెరవడానికి ప్రయత్నిస్తుంటే, ప్రస్తుతం మెయింటెనెన్స్‌ పని నడుస్తున్నదని, త్వరలోనే తిరిగి ప్రజల ముందుకు వస్తామన్న సందేశం కనిపిస్తున్నది. గత నెలలో చత్తీస్‌గఢ్‌ బిజెపికి చెందిన వెబ్‌సైట్‌ కూడా హ్యాకింగ్‌కు గురైన విషయం తెలిసిందే. ఇందులో పాకిస్థాన్‌ జెండా కనిపించడం అప్పట్లో  దుమారం రేగిన విషయం విదితమే.