బిసి పొలిటికల్ జేఏసీ నాగర్ కర్నూల్ జిల్లా కన్వీనర్ గా అరవిందాచారి.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్3(జనంసాక్ షి):
బిసి పొలిటికల్ జేఏసీ నాగర్ కర్నూల్ జిల్లా కన్వీనర్ గా తాడూరు మండలం ఇంద్రకల్ గ్రామానికి చెందిన డి. అరవిందా చారిని బిసి పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ నియమించారు.
ఈమేరకు శనివారం హైదరాబాద్ గన్ పార్కు లోని అమరవీరుల స్తూపం వద్ద నియామక పత్రాన్ని అందించారు.
అనంతరం రాచాల మాట్లాడుతూ అరవిందా చారి గత 10 సంవత్సరాల నుంచి బిసి విద్యార్థి నాయకుడిగా బీసీ విద్యార్థుల సమస్యలపై, బీసీల హక్కులకై నిరంతరం ఉద్యమిస్తున్నాడని, పొలిటికల్ జేఏసీ నాయకుడిగా బీసీ రాజ్యాధికారానికై కృషి చేయాలని సూచించారు.అనంతరం అరవిందా చారి మాట్లాడుతూ నామీద నమ్మకంతో జెఏసి కన్వీనర్ గా నియ మించిన స్టేట్ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ గారికి, సహకరించిన కోటికె రాము ముదిరాజ్ గారికి, శశికుమార్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ,బీసీ రాజ్యాధికారమే లక్ష్యంగా అందరిని కలుపుకుని పనిచేస్తానని తెలిపారు.