బి ఆర్ ఎస్ కు బిగ్ షాక్ కారు దిగి కాంగ్రెస్ లో చేరిన ముదొల్ మాజీ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి

భైంసా మార్చ్ 21 జనం సాక్షినిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గడ్డిగారి విఠల్ రెడ్డి ఎట్టకేలకు తన స్వంత గూటికి చేరుకున్నాడు. హైదరాబాద్ లో ముందుగా మంత్రి సీతక్కను కలిసిన విఠల్ రెడ్డి అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నాడు. ఈ సంధర్బంగా సీఎం రేవంత్ రెడ్డి పార్టీలోకి సాదర స్వాగతం పలికారు. దింతో ఎట్టకేలకు తన సొంత గూటికి చేరాడు. కాంగ్రెస్ పార్టీ తరపున 2014 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రమాదేవిపై గెలుపొందిన విఠల్ రెడ్డి అనంతరం అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. అనంతరం 2018 లో టీఆర్ఎస్ తరపున బరిలోకి దిగి మరోమారు బీజేపీ అభ్యర్థి రమాదేవిపై గెలిచి రెండు పర్యాయాలు విజయం సాధించాడు. ఈ మధ్య కాలంలో విఠల్ రెడ్డిపై వ్యతిరేకత పెరగడం, పార్టీలోని సీనియర్ నాయకులు తిరుగుబాటు చేయడంతో 2023 ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసాడు. తన అనుచరులను ముందుగానే కాంగ్రెస్ పార్టీలోకి పంపి ఎట్టకేలకు కాంగ్రెస్ తీర్థం పుచుకుంటారన్న ఊహాగానాలు నిజం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరాడు.