బీఆర్ఎస్ తోనే దేశాభివృద్ధిబీఆర్ఎస్ తోనే దేశాభివృద్ధి: మహిపాల్ రెడ్డి, బిఆర్ఎస్ ఒమన్ అధ్యక్షుడు 


హైదరాబాద్ (జనంసాక్షి): దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి పుట్టిందే బీఆర్ఎస్ అని ఎన్నారై ఒమాన్ శాఖ అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి ఒక ప్రకటనలో అన్నారు. కేంద్ర ప్రభుత్వం  ప్రవేశ పెట్టిన బడ్జెట్లో దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం చూపిస్తున్న వివక్షను ప్రజలు గమనించాలని ప్రజలను కోరారు. ప్రజల  ఆకాంక్షలకు వ్యతిరేఖంగా పాలిస్తున్న మోడీని ప్రశ్నించడంలో కాంగ్రెస్ విఫలం అయ్యిందని విమర్శించారు. దేశంలో దివాలా తీసిన కాంగ్రెస్ రాష్ట్రంలోనూ  చేవచచ్చినందున కొత్త నాయకత్వాన్ని  దేశ ప్రజలు కోరుతున్నారని పేర్కొన్నారు. ఎనిమిదేళ్ళ పాలనలోనే తెలంగాణను నంబర్ వన్‌గా మార్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన కోసం  దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు. ఈ నెల 5 వ తేదీ మహారాష్ట్రలోని నాందేడ్‌లో జరగనున్న బిఅర్ఎస్ నిర్వహిస్తున్న బహిరంగసభకు లక్షలాది ప్రజలు  తరలివచ్చి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు మద్దతు తెలపాల్సిందిగా విజ్ఞప్తి చేసారు. బిఅర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల పర్యవేక్షణలో అతి త్వరలో బిఅరెస్ ఎన్నారై ఒమాన్ శాఖలో వివిధ రాష్ట్రాలకు చెందిన ఎన్నారైలతో కోర్ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు మహిపాల్ రెడ్డి తెలిపారు.