బీఈడీ అధ్యాపకులతో నాగర్జున విశ్వవిద్యాలయ అధికారుల చర్చలు సఫలం

గుంటూరు: బీఈడీ ఆధ్యాపకులతో నాగార్జున విశ్వవిద్యాలయ అధికారుల చర్చల సఫలమయ్యాయి. మూడు రోజుల్లో వేతన సమస్య పరిష్కరిస్తామని అధికారులు అధ్యాపకులకు హామీ ఇచ్చారు. దాంతో మూడు రోజులుగా మూల్యాంకనానికి గైర్హాజరవుతున్న బీఈడీ అధ్యాపకులు రేపటి నుంచి విధులకు హాజరు కావాలని నిర్ణయించుకున్నారు.