బీజేపీ ఆధ్వర్యంలో ఓటు నమోదు కార్యక్రమం ప్రారంభం

నూతన ఓటు హక్కు నమోదు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని బిజెపి సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి బూరుగు సురేష్ గౌడ్ పిలుపునిచ్చారు. శనివారం బిజెపి చేర్యాల మండల, చేర్యాల పట్టణ మండల అధ్యక్షులు కాశెట్టి పాండు పటేల్, కాటం సురేందర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో 18  సంవత్సరాలు నిండిన యువతీ యువకులకు నూతన ఓటు నమోదు కార్యక్రమాన్ని  ప్రారంభించారు. ఈ సందర్భంగా బిజెపి సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి బూరుగు సురేష్ గౌడ్ మాట్లాడుతూ.. అర్హత కలిగిన వారందరికీ ఓటును నమోదు చేయాలని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు కెవీఎల్ఎన్ రెడ్డి, జనగామ నియోజకవర్గం కన్వీనర్ బల్ల శ్రీనివాస్, బిజెపి జిల్లా అధికార ప్రతినిధి నర్ర మహేందర్ రెడ్డి, బిజెపి మండల ప్రధాన కార్యదర్శులు వడ్లకొండ సంజీవులు, తోట బాలరాజు, జిల్లా మాజీ ఆర్మీ సెల్ కన్వీనర్ శ్రీనివాస్ రెడ్డి, కిషన్ మోర్చా జిల్లా అధికార ప్రతినిధి వడ్లకొండ వెంకటేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు మధు, బిజెపి చేర్యాల పట్టణ ఎస్సీ మోర్చా అధ్యక్షులు సిద్ధులు, బిజెపి ఓబీసీ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు నరసింహులు, బీజేవైఎం సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు మనోజ్, కొమురవెల్లి మండల బీజేవైఎం అధ్యక్షులు రమేష్ తదితరులు పాల్గొన్నారు.