బీటలు వారిన కలెక్టరేట్‌

కరీంనగర్‌, జూలై 27 (జనంసాక్షి) : నగరం నడి బొడ్డున ఉన్న కలెక్టరేట్‌ వర్షంలో తడిసి ముద్దైంది. గత రెండు మూడు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండడంతో జిల్లా కలెక్టరేట్‌ కాంప్లెక్స్‌ల్లోని పలు ప్రభుత్వ కార్యాలయాలు వర్షంతో తడిసిపోయాయి. పై నుంచి నీరు కారతుండడంతో రికార్డుల తడిసి ముద్దైనాయి. కోట్ల రూపాయల ప్రజాధనం వెచ్చించి నిర్మించిన కలెక్టరేట్‌ కాంప్లెక్స్‌ మర మ్మత్తులకు నోచుకోక పోవడంతో సిబ్బంది, అధికారులు విధి నిర్వహణకు తీవ్ర ఆటంకం కలుగుతుంది. కలెక్టర్‌ కాంప్లెక్స్‌లోని వివిధ కార్యాలయాలు, జిల్లా కలెక్టర్‌ కార్యాలయ సిబ్బంది, జిల్లా సహకార అడిట్‌ అధికార కార్యాలయంలో, ఆడిట్‌ రికార్డు రూంలో, స హకార తనిఖీ అధికారి కార్యాలయం, విధ్యాధి కారి కార్యాలయం తదితర కార్యాలయాల ఆవరణలో పై నుంచి నీరు కారుతూ పై కప్పు పెచ్చులు ఊడి క్రింద పడుతున్నాయి. దీంతో వివిధ పనులపై కార్యాలయాలకు వస్తున్న ప్ర జలు ఇబ్బందులు ఎదుర్కోవడమే కాక అవి ఎపుడు ఊడి ఎవరి మీద పడుతాయో అని తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. జిల్లా పరిపాలనా కార్యాలయం కలెక్టర్‌ కాంప్లెక్స్‌ ఆవరణలో నీరు నిలిచిపోయి, బీటలు వారిన గోడల నుంచి నీరు ఊటచెరువులగా తలిపిస్తు న్నది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, కలెక్టర్‌ నిధులు మంజూరు చేయించి కలెక్టర్‌ కార్యాల యాన్ని తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఎంతైనా ఉం దని ప్రజలు అనుకొంటున్నారు. నగరాన్ని సుందరీకరణ చేసిన కలెక్టర్‌ తమ ప్రాంగణా న్ని మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తున్నాయి. తక్షణమే నిధులు మంజూ రు చేయించి, అభివృద్ధి పర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బీటలు వారుతున్న గోడలకు మరమ్మతులు చేయించాలి. వర్షాకాలం కావ డంతో గోడలు కూలిపోయే ప్రమాదం ఉంది శుభ్రపరిచే సిబ్బంది నీరు నిల్వ ఉండడంతో వాటిని శుభ్రం చేయలేక అవస్థలు ఎదుర్కొం టున్నారు. మరమమ్మతులు చేపట్టాలని వివిధ కార్యాలయాల సిబ్బంది అధికారులను కోరుతున్నారు.