బీడీ కార్మికులకు రూ.1500 ఫించన్‌ ఇవ్వాలిని

జామాబాద్‌, అక్టోబర్‌ 5 :  బీడీ కార్మికులకు నెలకు 1500రూపాయలు ఫించను అందించాలని కోరుతూ కలెక్టర్‌ కార్యాలయం ఎదుట శుక్రవారం నాడు లేబర్‌ రైట్స్‌ వెల్ఫేర్‌ సొసైటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షుడు శ్రీనివాస్‌ మాట్లాడుతూ బీడీ కార్మిక కుటుంబాలు ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందేందుకు పాలకులు కృషి చేయాలని అన్నారు. వీరి సంక్షేమం కోసం ప్రభుత్వం 5వేల కోట్ల రూపాయలతో ప్రత్యేక ఆర్థిక ప్యాకేజిని ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. కార్మికులకు అందుతున్న కనీస వేతనంలో 50శాతం ఫించన్‌ ఇవ్వాలని కోరారు. వర్థి బీడీ కార్మికులకు యాజమాన్యాల ద్వారా పీఎఫ్‌ కార్డులు, కనీస వేతనాలు అందించేలా చూడాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో బీడీ కార్మికుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.