బీవీ మోహన్‌రెడ్డి కన్ను మూత

హైదరాబాద్‌: అనారోగ్యంతో భాదపడుతున్న తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి బీవీ మోహన్‌రెడ్డి కొద్ది సేపటి క్రితం నగరంలోని ఓ ప్రైవేట్‌ ఆసుప్రతిలో మరణించారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మోహన్‌రెడ్డి నగరంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. కర్నూల్‌ జిల్లాకు చెందిన తెలుగుదేశం బీవీ మోహన్‌రెడ్డి ఎన్టీఆర్‌ మంత్రివర్గంలో పనిచేశారు.