బీసీలకు అండగా తెదేపా

సదాశివపేట: గురువారం సాయంత్రం తెదేపా పట్టణశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఇఫ్తార్‌ విందుకు ఆయన హాజరయ్యారు. తమ పార్టీ మైనార్టీలకు అండగా నిలుస్తుందని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మైనార్టీలు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎదగడానికి కృషి చేస్తామన్నారు. బీసీలకు రాజకీయాల్లో అవకాశం కల్పించిన విధంగానే మైనార్టీకలు కూడా కల్పిస్తామన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే యూకేజీ నుంచి పీజీ వరకు మైనార్టీకు ఉచిత విద్యను అందిస్తామనాన్నరు. మాజీ మంత్రి బాబూమోహన్‌, తెదేపా జిల్లా అధ్యక్షుడు హనుమంతరావు, మాజీ డీసీబీ మాజీ ఛైర్మన్‌ నావాజ్‌ రెడ్డి పాల్గోన్నారు.