బీసీలకు తెదేపా పై విశ్వాసం ఉంది:రామకృష్ణుడు

విజయవాడ: బీసీలకు తెదేపా పై విశ్వాసం ఉందని ఆ పార్టీ నేత యనమల రామకృష్ణుడు  అన్నారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో వారికి 100 సీట్లు ఇచ్చి తీరుతామని ఆయన విజయవాడలో స్పష్టం చేశారు. బీసీ డిక్లరేషన్‌కు మద్దతు కూడగట్టేందుకు వచ్చే నెలలో పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఢిల్లీ పర్యటన చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు.