బీసీలకు పెద్ద పీట:టీడీపీ

హైదరాబాద్‌: రాష్ట్రంలో కొన్ని సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించిన తెలుగుదేశం పార్టీకి ప్రస్తుతం గడ్డు కాలం ఎదురైంది ఇటు తెలంగాణ అంశంపై ఎటు తేల్చుకోక తెలంగాణలో ఆ పార్టీ నేతల్లో అసంతృప్తి ఉంది. సీమాంధ్రలోను జగన్‌ దాటాకి తట్టుకోలేక ఉప ఎన్నికల్లో ఒక్క సీటు కూడా కైవసం చేసుకోలేక పోయింది.  అయితే పార్టీకి దూరమవుతున్న బీసీలను దగ్గరికి చేసుకోవాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు యోచిస్తున్న తరుణంలో టీడీపీ 2014 ఎన్నికల్లో బీసీలకు పెద్ద పీట వేయాలని  వంద సీట్లు బీసీలకు కేటాయిస్తున్నట్లు నిర్ణయం తీసుకుని ఈ రోజు మీడియాకు తెలియజేశారు.