బీసీ ఉపాధ్యాయ కార్యదర్శిగా వామన్‌రావు

మెదక్‌: బీసీ ఉపాధ్యాయుల సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా మెదక్‌ జిల్లాకు చెందిన వామన్‌రావు నియమితులయ్యారు.  ఆంధ్రప్రదేశ్‌ బీసీ సంక్షమ సంఘ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య నియమాక ఉత్తర్వులు జారీ చేశారు. వామన్‌రావు మాట్లాడుతూ  తనకు అప్పగించిన బాధ్యతను సక్రమంగా పూర్తిచేస్తానన్నారు. జిల్లాలో బీసీ ఉపాధ్యాయులు సంక్షేమానికి తనవంతుగా కృషి చేస్తానన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించినందుకు రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణయ్యకు  కృతజ్ఞతలు తెలియజేశారు.