బీసీ యువ గర్జన

మెదక్‌:ఈ నెల 10వ తేదీన జిల్లా కేంద్రన సంగారెడ్డిలో జరుపతల పెట్టిన బీసీ యువ గర్జన జయప్రదం చేయాలని బీసీ ఉపాధ్యాయ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్‌, ప్రధాన కార్యదర్శి వామన్‌రావు,బీసీ సంక్షేమసంఘ రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌.కృష్ణయ్య ముఖ్యఅతిధిగా హాజరవుతారని  తెలియజేశారు. బీసీలకు చట్టసభలో 50 శాతం రిజర్వేషన్‌,బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్‌ కల్పించాలన్న అంశాలపై చర్చిస్తారని తెలిపారు. జిల్లాలోని బీసీ నాయకులు, ఉపాధ్యాయులు,ఉద్యోగులు,మేదావులు,యువకులు అధిక సంఖ్యలో  తరలిరావాలని తెలియజేశారు.