బీసీ వెల్ఫేర్‌ వెబ్‌సైట్‌ను ప్రారంభించిన సీఎం

హైదరాబాద్‌: బీసీ వెల్ఫేర్‌ వెబ్‌సైట్‌ను ఈ రోజు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వెనకబడిన తరగతుల కోసం బడ్జెట్‌ కేటాయింపులను అవసరమైతే పెంచుతామన్నారు. వెనుకబడిన అన్ని కులాలను కలిసి స్టడీ సర్కిల్స్‌ను జిల్లాల వారీగా ఏర్పాటు చేస్తామని అన్నారు.