బీ సి వసతి గృహ విద్యార్థులకు క్రీడలు

ఖమ్మం, (జనం సాక్షి) : కమిషనర్ బిసి వెల్ఫేర్ ఆదేశానుసారం జిల్లా బీసీ డెవలప్మెంట్ అధికారిని జి జ్యోతి ఆధ్వర్యంలో ప్రభుత్వ బీసీ కళాశాల బాలుర వసతిగృహము పాలేరు (ఖమ్మం )నందు వసతి గృహ విద్యార్థులకు క్రీడలను నిర్వహించారు. వసతి గృహ సంక్షేమ అధికారి నెల్లూరి నాగేశ్వరరావు పర్యవేక్షణలో క్రీడా పోటీలు జరిగాయి. కబడ్డీ, ఖోఖో, అథ్లెటిక్స్ పోటీలను నిర్వహించగా, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నెల్లూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ క్రీడలు ఐకమత్యాన్ని పెంపొందిస్తాయని, మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం డివిజన్ ఏబిసిడివో శ్రీ ఎం ఈదయ్య, సిబ్బంది పాల్గొన్నారు.