బూస్టర్‌డోసు అక్కర్లేదు

share on facebook


` శాస్త్రీయ ఆధారాలు లేవు
` ఐసీఎంఆర్‌
న్యూఢల్లీి,నవంబరు 22(జనంసాక్షి):కొవిడ్‌ 19 నివారణకు టీకా బూస్టర్‌డోసు తప్పనిసరని మద్దతు తెల్పడానికి తగిన శాస్త్రీయ ఆధారాలు ఇంతవరకు లేవని ఐసిఎంఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ బలరామ్‌ బార్గవ సోమవారం వెల్లడిరచారు. దేశం లోని వయోజనులందరికీ రెండో డోసు పూర్తి చేయడమే ఇప్పుడు ప్రధాన లక్షంగా ఆయన పేర్కొన్నారు. నేషనల్‌ టెక్నికల్‌ అడ్వయిజరీ గ్రూప్‌ ఆన్‌ ఇమ్యునైజేషన్‌ ఇన్‌ ఇండియా (ఎన్‌టిఎజిఐ) తదుపరి సమావేశంలో బూస్టర్‌ డోసు అవసరంపై చర్చ జరిగే అవకాశం ఉందని ఆయా వర్గాలు తెలిపాయి. రెండో డోసు వయోజనులందరికీ ఇవ్వడం ఒక్క భారత్‌ లోనే కాదు, యావత్‌ ప్రపంచం లోనే పూర్తి చేయడం ప్రభుత్వాల బాధ్యతగా ఉంటోంది. టీకా నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, అయితే మొత్తం జనాభాకు రెండు డోసులు అందించిన తరువాతనే బూస్టర్‌ డోసు గురించి నిపుణుల సిఫార్సుపై నిర్ణయం తీసుకుంటామని ఇటీవల కేంద్ర ఆరోగ్య మంత్రి మాండవీయ వెల్లడిరచారు. దేశంలో అర్హులైన వారిలో 82 శాతం మందికి మొదటి డోసు అందిందని, 43 శాతం మంది పూర్తిగా రెండు డోసులు తీసుకున్నారని అధికార వర్గాల సమాచారం వెల్లడిరచింది. సోమవారం ఉదయం 7 గంటల వరకు దేశంలో 116,87 కోట్ల డోసులు పంపిణీ అయ్యాయి.

Other News

Comments are closed.