బెంగాల్‌లో దీదీ, తమిళనాడులో అమ్మలదే హవా

C

– కేరళలో కామ్రేడ్లు

– అసోంలో కాషాయం

– పుదుచ్చేరిలో కాంగ్రెస్‌ల గెలుపు

న్యూఢిల్లీ,మే19(జనంసాక్షి): తమిళనాడు మినహా ఐదురాష్టాల్ల్రో ఊహించినట్లుగానే ఫలితాలు వెలువడ్డాయి. ఫలితాలు కొన్నిచోట్ల ఊహించినట్లుగానే రాగా.. తమిళనాడులో మాత్రం ఎవరూ ఊహించని విధంగా అన్నాడీఎంకే రెండోసారి అధికారంలోకి వచ్చేందుకు సిద్ధమైంది. పశ్చిమబెంగాల్‌లో ఇంతకుముందు 2011లో జరిగిన ఎన్నికలలో ఇతర పార్టీలతో కూటమిగా పోటీ చేసినప్పటి కంటే, ఈసారి ఒంటరి పోటీలోనే మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ అధిక స్థానాలు సాధిస్తోంది. దాదాపు మూడింట రెండొంతుల మెజారిటీకి దగ్గరగా ఉంది. అసోంలో 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న సీఎం తరుణ్‌ గొగోయ్‌ను కాదని, బీజేపీ నేత శర్వానంద సోనోవాల్‌కు ప్రజలు పట్టంగట్టారు. అలాగే కేరళలో అవినీతి ఆరోపణలలో కూరుకుపోయిన ఊమెన్‌ చాందీని దించి, ఎల్డీఎఫ్‌ కూటమిని గెలిపించారు. పుదుచ్చేరిలో మాత్రం హంగ్‌ అసెంబ్లీ ఏర్పడేలా ఉంది. ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రకారం తమిళనాడులో డిఎంకె అధికారంలోకి వస్తుందని తెలిపారు. గురువారం ఉదయం ఎన్నికల ఫలితాలు వచ్చేసరికి దిమ్మతిరిగేలా జయలలిత రెండోసారి ప్రభుత్వ పగ్గాలు చేపట్టబోతున్నారు. అంతాగాకుండా గతంలో కన్నా ఎక్కువ స్థానాల్లో విజయం సాధించారు. ఇక అసోంలో బిజెపి విజయం సాధించింది. అక్కడ బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయంగా ఉంది. పశ్చిమ్‌బంగ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూఆ  ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలకు అనుగుణంగా తృణమూల్‌ కాంగ్రెస్‌ దూసుకెళ్తొంది. పశ్చిమ్‌ బంగలో మొత్తం 294 స్థానాలు ఉండగా 220 స్థానాలకుచేరువలో మమత పార్టీ టిఎంసి ఉంది. దీంతో మమత రెండోసారి పశ్చిమబంగ సిఎం కాబోతున్నారు. లెఫ్ట్‌ పార్టీలు ఇక్కడ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. తమిళనాట కెప్టెన్‌ డీలాపడ్డారు.  ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలకు అనుగుణంగానే కేరళలో ఫలితాలు వెలువడుతున్నాయి. కేరళ అసెంబ్లీలో 80 స్థానాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వివిధ పార్టీల బలాబలాలు ఇలా ఉన్నాయి. ఎల్‌డీఎఫ్‌ ఇక్కడ అధికారం చేపట్టబోతోంది. అచ్యుతానంద్‌ లేదా విజయన్‌లో ఎవరో ఒకరు సిఎం కానున్నారు. ఇక అసోం, కేరళలో అధికారం కోల్పోయిన కాంగ్రెస్‌ పాంఇచ్చేరిలో కొత్తగా అధికారం దక్కించుకోబోతోంది. కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాలను బట్టి కాంగ్రెస్‌ కూటమి  ఆధిక్యంలో ఉంది. యానాం నియోజకవర్గ ఓట్ల లెక్కింపు స్థానిక పౌర కార్యాలయం కాన్ఫరెన్స్‌ హాలులో కొనసాగుతోంది. తొలి రౌండులో 7 బూత్‌లు లెక్కించగా కాంగ్రెస్‌ అభ్యర్థి మల్లాడి కృష్ణారావుకు 3290 ఓట్లు, ప్రత్యర్థి చిరుకోటి భైరవస్వామి (ఎన్నార్‌ క్రాంగ్రెస్‌)కి 2570 ఓట్లు లభించాయి. మొదటి రౌండు పూర్తయ్యేసరికి కాంగ్రెస్‌ 720 ఓట్ల ఆధిక్యంలో ఉంది. మొత్తంగా ఐదు

రాష్టాల్ర తుది ఫళితాలు ఎలా ఉన్నా అంచనాల మేరకు ఫలితాలు వెలువడ్డాయి. ఓ రకంగా ఈ ఎన్నికలు కాంగ్రెస్‌కు షాక్‌ లాంటివే. బిజెపికి మాత్రం కొంత ఊరటనిచ్చే అంశగా చూడాలి. అసోం శాసనసభ ఫలితాల్లో బీజేపీ విజయం సాధించడంతో అసోం ప్రజలకు ప్రధాని నరేంద్రమోడీ ధన్యవాదాలు తెలిపారు. అసోం అభివృద్ధి, ప్రజల కలలు సాకారం చేస్తామని స్పష్టం చేశారు. తమకు బాసటగా నిలిచిన అసోం సహా బెంగాల్‌, తమిళనాడు, కేరళ పుదుచ్చేరి ప్రజల సేవ కోసం కృషి చేస్తానని చెప్పారు. 126 స్థానాలకు గానూ బీజేపీ అత్యధిక స్థానాల్లో ముందంజలో ఉంది. ఇక తృణామూల్‌కు భారీ విజయాన్ని అందించిన బెంగాల్‌ ప్రజలకు మమతా బెనర్జీ ధన్యవాదాలు తెలిపారు. ప్రత్యర్థి శక్తులు ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసేందుకు ప్రయత్నించారని, కానీ ప్రజలు మాత్రం ప్రశాంతంగా ఓటింగ్‌లో పాల్గొన్నారని దీదీ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ విజయ కేతనం ఎగరవేసిన నేపథ్యంలో  విక్టరీ సంకేతం చూపిస్తూ విూడియాతో మాట్లాడిన మమతా బెనర్జీ ఎన్నో సమస్యలు ఎదురైనా ఎన్నికల సంఘం మాత్రం ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించిందన్నారు. ఈనెల 27న తమ పార్టీ అభ్యర్థులు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు దీదీ తెలిపారు. 29న ప్రత్యేక శాసనసభ సమావేశాలు నిర్వహించనున్నట్లు ఆమె చెప్పారు. అయితే బీజేపీతో కానీ కాంగ్రెస్‌తో కానీ పొత్తుపై మాత్రం స్పందించేందుకు దీదీ నిరాకరించారు.  బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం గురువారం సాయంత్రం 6 గంటలకు సమావేశం కానుంది. సమావేశంలో ఐదు రాష్టాల్ర ఎన్నికల ఫలితాలతో పాటు ఇతర అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. అస్సాం రాష్ట్రంలో మాత్రమే బీజేపీ విజయం ఖాయమైంది. పశ్చిమబెంగాల్‌లో మూడో స్థానానికి మాత్రమే పరిమితమైంది. తమిళనాడు, పుదుచ్చేరిలో బీజేపీ పత్తా లేకుండా పోయింది. కేరళలో

ఒక స్థానంలో గెలిచింది.

తమిళనాట చరిత్ర తిరగరాసిన జయలలిత

ఐదు రాష్టాల్లో అసెంబ్లీ  ఎన్నికల ఫలితాల్లో ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలను తమిళనాడు తిరగరాసింది. రెండోసారి జయలలిత విజయకేతనం ఎగురవేశారు. ఎంజిఆర్‌ తరవాత ఆమె ఈ రికార్డును దక్కించుకున్నారు. తొలిసారి వరుసగా జయలలిత రెండోసారి సిఎం కాబోతున్నారు. అధికారంలో ఉన్న పార్టీ తదుపరి ఎన్నికల్లో తమ అధికారం నిలబెట్టుకున్న చరిత్ర తమిళనాడులో కొత్తకాదు. స్వాతంత్య్రానంతరం జరిగిన ఎన్నికలు మొదలుకొని … 1967 వరకు తమిళనాట కాంగ్రెస్‌ హవా కొనసాగింది. 1967లో అణ్నాదురై నేతృత్వంలోని డీఎంకే కాంగ్రెస్‌ పాలనకు చరమగీతం పాడి అధికారం చేపట్టింది. అణ్నాదురై మరణానంతరం ముఖ్యమంత్రి అయిన కరుణానిధి 1971లో జరిగిన ఎన్నికల్లో అధికారం నిలబెట్టుకున్నారు. డీఎంకీని వీడి అన్నాడీఎంకే పేరుతో కొత్త పార్టీని స్థాపించిన ఎంజీఆర్‌ 1977లో శాసనసభ ఎన్నికల్లో అధికారం చేపట్టి 1980, 1984 ఎన్నికల్లో తన అధికారాన్ని నిలబెట్టుకున్నారు. ఆ ఎన్నికల తర్వాత ఎంజీఆర్‌ మరణానంతరం జరిగిన ఏ శాసనసభ ఎన్నికల్లోనూ తమిళనాడులో అధికారంలో ఉన్న పార్టీ వరుసగా రెండో సారి అధికారాన్ని నిలబెట్టుకోలేదు. తమిళనాడులో నిజానికి ఇప్పటివరకు ఎంజీ రామచంద్రన్‌ తర్వాత ఏ ఒక్కరూ రెండోసారి వరుసగా ముఖ్యమంత్రి కాలేదు. 1984 తర్వాత అంటే, 32 ఏళ్ల తర్వాత తమిళనాడులో వరుసగా రెండోసారి ఒక ముఖ్యమంత్రి అధికారం చేపట్టడం ఇదే మొదటిసారి. ఇన్నాళ్లూ ప్రతిసారీ అధికార మార్పిడి జరుగుతూనే వచ్చింది. కానీ ఈసారి మాత్రం జయలలిత రికార్డు సృష్టించేందుకు సిద్ధమయ్యారు. ఇకపోతే బెంగాల్లో రెండోసారి మమతా బెనర్జీ కూడా గత ఎన్నికలను మించి ఫలితాలను సాధించి రెండోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారు. అసోంలో తొలిసారి బిజెపి విజయం నమోదు చేసుకుంది. 15 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఏకఛత్రాధిపత్యం వహిస్తున్న తరుణ్‌ గొగోయ్‌ అసోంలోను, గత ఎన్నికల తర్వాత కేరళ సీఎం అయిన ఊమెన్‌ చాందీ.. ఇద్దరూ తమ అధికారాన్ని ఈసారి నిలబెట్టుకోలేకపోయారు. అయితే.. ముఖ్యమంత్రి పదవుల్లో ఉన్న ఇద్దరు మహిళలు జయలలిత, మమతా బెనర్జీ మాత్రం చరిత్ర తిరగరాసి అధికారాన్ని నిలబెట్టుకున్నారు. మరోవైపు పశ్చిమబెంగాల్‌లో మమతా బెనర్జీ కూడా రికార్డు సృష్టిస్తున్నారు. ఆమె కూడా వరుసగా రెండోసారి ముఖ్యమంత్రి అయ్యేందుకు సిద్ధమయ్యారు. అందులోనూ ఇంతకుముందు ఆమెకు వచ్చిన స్థానాల కంటే కూడా ఎక్కువ వచ్చేలా

కనిపిస్తున్నాయి. 294 నియోజకవర్గాలున్న పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీలో ప్రస్తుతం టీఎంసీకి 184 స్థానాలు మాత్రమే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏకంగా 216 స్థానాలలో టీఎంసీ అభ్యర్థులు గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో దాదాపు మూడింట రెండు వంతుల మెజారిటీని దీదీ సాధించినట్లయింది.

ఆ ఇద్దరు మేడమ్‌లకు ప్రధాని శుభాకాంక్షలు

ఆ ఇద్దరు మహిళలు మరోమారు సిఎం పీఠం ఎక్కబోతున్నారు. పశ్చిమ్‌బంగ, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అన్నాడీఎంకే, తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీలు భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తున్నాయి. ఆ రాస్ట్‌ఆరల సిఎంలు మమతా బెనర్జీ, జయలలితలు మరోమారు వరుసగా రెండో సారి సిఎంలుగా పీఠం ఎక్కనున్నారు. ఈ సందర్భంగా ఇరు రాష్టాల్ర  ముఖ్యమంత్రులకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. జయలలితతో ఫోన్‌లో మాట్లాడానని.. అన్నాడీఎంకే విజయం సాధిస్తున్నందుకు శుభాకాంక్షలు తెలిపినట్లు ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు. అనంతరం బంగాల్‌ సీఎం మమతాబెనర్జీకి కూడా మోదీ ఫోన్‌ చేశారు. వరుసగా రెండోసారి అధికారంలోకి రానున్న దీదీకి అభినందనలు తెలియజేసినట్లు మోదీ ట్వీట్‌ చేశారు.

విజయ్‌కాంత్‌ కూటమికి ఘోర పరాభవం

రాజకీయాల్లో నేలవిడిచి సమాఉ చేయరాదు. ఊహలకు తావులేకుండా ప్రజలనాడి పట్టలేకపోతే రాజకీయాల్లో మనుగడ సాధ్యం కాదు. తమిళనాట కెప్టెన్‌ విజయ్‌కాంత్‌ రాజకీయ సునావిూ సృష్టిస్తానని చెప్పి చతికిల పడ్డాడు. తానే తదుపరి సిఎంనంటూ హడావిడి చేసి తీరా ఫలితాలు వచ్చే సరికి తానూ గెలవలేకుండా పోయాడు. దీంతో నమ్ముకున్న వారిని నట్టేట్లో ముంచేశాడే అన్నట్లుగా తయారైంది కెప్టెన్‌ విజయకాంత్‌ పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి ముఖ్యమంత్రి కుర్చీ సొంతం చేసుకుంటానని చెప్పిన కెప్టెన్‌.. అసలు ఖాతాయే తెరవలేదు. స్వయంగా విజయకాంత్‌ కూడా తాను పోటీ చేసిన స్థానంలో వెనుకంజలోనే ఉన్నారు. డీఎండీకే అధినేతగా పరుష వ్యాఖ్యలు చేసి, విూడియాపై కూడా మండిపడిన విజయకాంత్‌, చివరకు సొంత పార్టీ నేతలపై కూడా అనుచితంగా ప్రవర్తించారు. గురువారం ఉదయం జాతీయ విూడియాలో ప్రసారమైన ఇంటర్వ్యూలో అయితే.. తాను హీరోనని, కరుణానిధి విలన్‌ అని, జయలలిత లేడీ విలన్‌ అని కూడా వ్యాఖ్యానించారు. కానీ చివరకు తాను పోటీ చేసిన ఉళుందుర్‌ పెట్టాయ్‌ నియోజకవర్గంలో మూడోస్థానంలో నిలిచారు. తమిళనాడులో ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా ప్రముఖ నటుడు, డీఎండీకే అధ్యక్షుడు కెప్టెన్‌ విజయ్‌కాంత్‌ వెనుకంజలో ఉన్నారు. ఉలుందూర్‌పెట్టై నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఆయన తొలి రౌండ్‌ నుంచి వెనుకబడి ఉన్నారు. ఈ నియోజకవర్గంలో డీఎంకే అభ్యర్థి వసంతవేల్‌ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. తమిళనాడులో ప్రస్తుతం జయలలిత నేతృత్వంలోని అన్నాడీఎంకే పార్టీ ఆధిక్యంలో కొనసాగింది. అక్కడ ఆధిక్యంలో అన్నాడీఎంకే ఉండగా, రెండో స్థానంలో డీఎంకే ఉంది. ఈసారి ఎన్నికల్లో గెలవాలన్న ఉద్దేశంతో విజయ్‌కాంత్‌ కొన్ని పార్టీలతో కలిసి ప్రజాస్వామ్య కూటమిని కూడా ఏర్పాటుచేశారు. రజనీకాంత్‌లా పిరికివాడిని కానని ఒక సమయంలో వ్యాఖ్యానించడంతో రజనీ అభిమానులు కెప్టెన్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. చివరకు అనుకున్నట్లే అయ్యింది. తన పార్టీ అభ్యర్థులలో ఒక్కరిని కూడా గెలిపించుకోలేకపోయిన విజయకాంత్‌.. చివరకు తాను కూడా గెలిచే పరిస్థితి కనిపించడం లేదు. దాంతో కెప్టెన్‌ తాను మునగడంతో పాటు ఓడను కూడా ముంచేశాడన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రాజకీయాల్లో ప్రజల నాడిపట్టకుండా పరుగెత్తితే ఓటమి తప్పదని విజయ్‌కాంత్‌కు ఆలస్యంగా తెలిసొచ్చింది.

ఈశాన్యంలో పాగా వేసిన బిజెపి

ఐదురాష్టాల్ర ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌కు తీవ్రనిరాశను మిగిల్చాయి.  చేతిలో ఉన్న  రెండు రాష్టాల్రుచేజారి పోయాయి. కొత్తగా పొత్తలుఓ పాండిచే/-చేరి మాత్రం వచ్చి చేరింది. అయితే ఈ రెంటితో పోలిస్తే ఇది కొంత ఊరటగా భావించాలి. అసోం,కేరళలో అధికారం కోల్పోవడంతో ఇక కాంగ్రెస్‌కు దక్షిణాన మిగిలింది కేవలం కర్నాటక మాత్రమే. తమిళనాడులో పాగాకు ప్రయత్నాలు ఫలించలేదు.  అసోం నుంచి కేరళ వరకు గురువారం  వెలుబడ్డ ఎన్నికల తీర్పు కొత్త రాజకీయ చిత్రాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఇన్నాళ్లూ ఏకఛత్రాధిపత్యం వహించిన కాంగ్రెస్‌ పార్టీకీ ఎక్కడా చోటు లేకుండా పోయింది. దీంతో ఆ పార్టీ ఆనవాళ్లు కనుమరుగయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఐదు రాష్టాల్ర  ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ స్పందించారు. ప్రజల తీర్పును తాము శిరసావహిస్తామని రాహుల్‌ ట్వీట్‌ చేశారు. ఎన్నికల్లో విజయం దిశగా ముందుకు దూసుకుపోతున్న పార్టీలకు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.

ఒక్క పుదుచ్చేరి మినహా.. మిగిలిన నాలుగు రాష్టాల్ల్రో కాంగ్రెస్‌ ఓటమి పాలయ్యింది. అసోంలో భాజపా, తమిళనాడులో అన్నాడీఎంకే, కేరళలో ఎల్‌డీఎఫ్‌, పశ్చిమ్‌బంగలో తృణమూల్‌ కాంగ్రెస్‌ గెలుపొందాయి.  పుదుచ్చేరిలో మాత్రం అన్నాడీఎంకే, కాంగ్రెస్‌ మధ్య గట్టి పోటీ కొనసాగుతోంది. తొలిసారి బీజేపీ పార్టీ ఈశాన్య రాష్టాల్ల్రో పాగా వేసింది. ఇది ఆ పార్టీ చరిత్రలో కొత్త అధ్యాయంగా భావించాలి.  అసోంలో బీజేపీ గెలవడం ఆ పార్టీకి కేంద్రంలో మరింత బలగాన్ని పెంచింది. ఇక మహిళా సీఎంలు కూడా తమ హవా మరోసారి కొనసాగించారు. పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ, తమిళనాడులో జయలలిత తిరిగి తమ స్థానాలను సుస్థిరం చేసుకున్నారు. కేరళలో ఎల్డీఎఫ్‌ విక్టరీ కొట్టడం మరో సంచలనమే. మొత్తం అయిదు రాష్టాల్ల్రోనూ కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బే తగిలింది. బెంగాల్‌లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న సీపీఐకి పెద్ద విఘాతమే ఎదురైంది. కొన్ని దశాబ్ధాలు పాటు బెంగాల్‌ను ఏలిన వామపక్ష పార్టీలకు ఇప్పుడు అక్కడ మనుగడ లేకుండాపోయింది. కాంగ్రెస్‌ సహచర్యం ఆ పార్టీలను ఆదుకోలేకపోయింది. అసోంలో బీజేపీ ఎంట్రీ కొత్త రాజకీయ చరిత్రకు శ్రీకారం చుట్టింది. గతంలో ఎన్నడూ ఈశాన్య రాష్టాల్ల్రో బీజేపీ ఆనవాళ్లు లేవు. కాంగ్రేసేతర పార్టీలకు ఆ ప్రాంతం దుర్బేధ్యంగా ఉండేది. ఇప్పుడా గోడలను బీజేపీ బ్రేక్‌ చేసింది. అంతేకాదు బెంగాల్‌, కేరళ రాష్టాల్ల్రో బీజేపీ సుమారు 10 శాతం ఓట్లను సంపాదించినట్లు తెలుస్తోంది. తమిళనాడులో మాత్రం బీజేపీకి మూడు శాతం ఓట్లు మాత్రమే లభించినట్లు స్పష్టమవుతోంది. శరబానంద సన్వాల్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించడంతో అసోంలో బీజేపీ గెలుపు ఖాయమైంది. ప్రతి కోణంలోనూ తాజా ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ చావుదెబ్బ తిన్నదని అర్థమవుతోంది. పార్టీ భవిష్యత్తుపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అసోంలో కాంగ్రెస్‌ పార్టీకి బీజేపీ కంటే ఎక్కువ ఓట్లే వచ్చాయి. బెంగాల్‌లో కూడా సీపీఐ కంటే కాంగ్రెస్‌కే ఓట్లు ఎక్కువ పోలయ్యాయి. కానీ ఆ పార్టీ సరైన పొత్తును ఎంచుకోకపోవడం వల్లే ఓటమి తప్పలేదని తెలుస్తోంది. అసోంలోనూ కాంగ్రెస్‌ పార్టీ సరైన భాగస్వామిని సెలక్ట్‌ చేసుకోలేకపోయింది. దీంతో అక్కడ ఆ పార్టీకి అవమానం తప్పలేదు. కాంగ్రెస్‌ పార్టీలో యువ నాయకుల లోపం ఎక్కువగా ఉంది. రాహుల్‌ గాంధీ మినహా మిగతా ఎవరూ ఉత్సాహాభరితంగా లేరు. ఎక్కువగా వయోవృద్ధులే ఉండడం వల్ల ఆ పార్టీకి కష్టకాలంగా మారింది. దీదీ, జయలు తమదైన స్టయిల్లో ప్రాంతీయ శక్తులుగా ఎదిగారు. అంతేకాదు వాళ్లు అదే రేంజ్‌లోనూ విజయాలనూ సొంతం చేసుకున్నారు. సరైన భాగస్వామి, సరైన సీఎం అభ్యర్థి ఉంటే ఆయా పార్టీలు విజయం సాధించడం ఖాయమని తాజా ఎన్నికల ద్వారా తెలుస్తోంది. 2017లో ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌ రాష్టాల్ల్రో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో కూటములను ఎవరూ తెలివగా ఏర్పర్చుకుంటారో వాళ్లే విజేతలుగా నిలిచే అవకాశాలున్నాయి. ఇప్పుడు అదే విన్నింగ్‌ ఫార్ములా కూడా. 2019లో జరగనున్న పార్లమెంట్‌ ఎన్నికలకు కూడా కూటముల ఏర్పాటే కీలమని తాజా ఎన్నికలు స్పష్టం చేస్తున్నాయి.

కేరళలో ఎల్డీఎఫ్‌దే విజయం

దేశంలో రాజకీయచైతన్యానికి పేరు పొందిన కేరళలో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వామపకక్షూటమి (ఎల్డీఎఫ్‌) ఘనవిజయం సాధించింది.మొత్తం 140 స్థానాల్లో ఎల్డీఎఫ్‌ 91 సాధించగా అధికార యూడీఎఫ్‌ 46 స్థానాలు సాధించి పరాజయం పొందింది. అసెంబ్లీ చరిత్రలో తొలిసారిగా భాజపా బోణీ కొట్టింది.తిరువనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో భాజపా నుంచి పోటీ చేసిన మాజీ క్రికెటర్‌ శ్రీశాంత్‌ ఓటమిపాలయ్యారు. సవిూప కాంగ్రెస్‌ అభ్యర్థి వీఎస్‌ శివకుమార్‌ చేతిలో శ్రీశాంత్‌ పరాజయం పాలయ్యారు. గత ఎన్నికల్లోనూ ఈ స్థానం నుంచి శివకుమార్‌ గెలుపొందారు.1977 నుంచి కేరళలో ఒకసారి కాంగ్రెస్‌ సారథ్యంలోని యూడీఎఫ్‌, మరో సారి ఎల్డీఎఫ్‌ అధికారాన్ని అందుకోవడం గమనార్హం.వూమెన్‌చాందీ నేతృత్వంలోని యూడీఎఫ్‌ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడింది. బార్‌ లైసెన్స్‌లు, సోలార్‌ కుంభకోణం రాష్టాన్న్రి కుదిపివేశాయి. బార్‌ లైసెన్స్‌ల కుంభకోణంలో భాగముందని ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి కేఎం మణి తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. చాందీ అనేక ప్రజాకర్షక పథకాలు చేపట్టినా అవినీతి ఆరోపణల పర్వంలో అవి కొట్టుకుపోయాయి. సోలార్‌ ప్యానల్స్‌ను విక్రయిస్తామని బిజూ, సరితా నాయర్‌ దంపతులు అనేక అక్రమాలకు పాల్పడ్డారు. ఈ

కుంభకోణం వెల్లడి కావడంతో రాష్ట్రం నిర్ఘాంతపోయింది. ఏకంగా సీఎం చాందీపైనే సరితా నాయర్‌ లైంగిక ఆరోపణలు చేయడంతో చాందీ ప్రతిష్ట మసకబారింది. సీఎం సహాయకుడు ఈ కుంభకోణంలో కీలకపాత్ర వహించారన్న వార్తలు వెలువడటంతో యూడీఎఫ్‌కు నష్టం కలిగించింది. యూడీఎఫ్‌ తీరుపై వామపకక్షూటమి తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. రాష్ట్రవ్యాప్తంగా పలు ఉద్యమాలు చేపట్టింది. అసెంబ్లీ దిగ్బంధం, హర్తాళ్‌, సమ్మె… తదితర చర్యలతో ప్రజా వ్యతిరేకచర్యలను ప్రజల్లోకి తీసుకెళ్లింది. కేరళ సీపీఎంలో కురువృద్ధుడిగా పేరుపొందిన వెళికకాత్తు శంకరన్‌ అచ్యుతానందన్‌ 90 ఏళ్లు పైబడినా ప్రచారంలో కీలకంగా వ్యవహరించారు. రాష్ట్ర రాజకీయాల్లో ఆయనకు సచ్ఛీలుడిగా పేరుంది. గత 2011 ఎన్నికల్లోనూ మెజార్టీకి రెండుసీట్ల దూరంలో ఎల్డీఎఫ్‌ ఆగిపోయింది. పార్టీలో పినరాయి విజయన్‌తో ఆయనకు సన్నిహిత సంబంధాలు లేవు. కానీ వీఎస్‌కు వున్న జనాకర్షణ వేరు. దీంతో సీపీఎం కూడా వీఎస్‌ పైనే ప్రచార బాధ్యతలను పెట్టింది. రాష్ట్రంలో గణనీయశక్తిగా ఎదిగేందుకు భాజపా కొన్ని సంవత్సరాలుగా యత్నిస్తోంది. ఈ ఎన్నికల్లో వెనుకబడిన వర్గమైన ఈళవల ప్రాబల్యమున్న భారత ధర్మజనసేనతో పొత్తుపెట్టుకుంది. దీంతోపాటు మెజార్టీ హిందూ వర్గమైన నాయర్ల సామాజికవర్గంలోనూ మద్దతు సాధించింది. నాయర్లు సహజంగా యూడీఎఫ్‌కు గట్టి మద్దతుదారులు. వీరిలో కొంత ఓట్లు భాజపాకు వెళ్లిపోవడంతో ఎల్డీఎఫ్‌కు అనుకూలించింది.